రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి సందర్భం గా ప్రేక్షకుల ముందుకు జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్నామని ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా ఆ రోజున రావడం గ్యారంటీ అని చిత్రబృందం చెబుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆ రోజు రావడం అనుమానంగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాల్సి ఉండడం దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం పర్ఫెక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వంటివి ఈ సినిమా వాయిదా పడుతుందని అని వార్తలు రావడానికి గల ముఖ్య కారణాలు.

అయితే ఏది ఏమైనా కూడా ఈసారి రావడం పక్కా అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు రిలీజ్ కష్టం అనే సమాధానాలు కూడా వారి నుండి వెలువడుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే సంక్రాంతికి ఇతర పెద్ద సినిమాలు విడుదలలు ఖరారు చేసుకున్నాయి. కానీ మధ్యలో వారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా విడుదల చేస్తున్నామని చెప్పడంతో వారి గుండె గుభేల్ మన్నాయి అనే చెప్పాలి. అయితే ఆర్ఆర్ఆర్ వల్ల ఆ సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాను పోస్ట్ ఫోన్ చేయడానికి సిద్ధంగా లేరు. 

ఎందుకంటే తాము ముందుగా సిద్ధం చేసుకున్న విడుదలను కాదని ఇప్పుడు రావడం ఏంటి అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే విడుదల విషయంలో  రాజమౌళి కి కూడా కొంత అనుమానం ఉంది. ఓవైపు సినిమా పూర్తిగా రెడీ కాకపోవడం మరోవైపు ఆల్రెడీ విడుదల తేదీని ఖరారు చేసిన నిర్మాతలు ఆందోళన చేసి ఉండడం వంటి కారణాలు ఆయన పై ప్రెషర్ ను పెంచుతున్నాయి.  ఈ నేపథ్యంలో శివరాత్రి డేట్ ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24వ తేదీన రాజమౌళి ఈ సినిమాను విడుదల చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: