అనసూయ ఈ మధ్యకాలంలో ఈమె పేరు బాగా వినిపిస్తోంది. ఇక ఈమె గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈ మధ్యకాలంలో మా ఎలక్షన్లలో కూడా నిలబడింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్గా ఉంటుంది. ఇక తన మీద వచ్చేటువంటి కామెంట్లపై తనదైన శైలిలో రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇక సినిమాలో కూడా తన మార్కును చాటుకుంది అనసూయ.

ఇక అనసూయ వేసుకున్న వస్త్రధారణపై మారిస్తే బాగుంటుందని సీనియర్ నటుడు కోట తెలియజేయగా. ఆయన పేరు చెప్పకుండా ఆమె ఆయన కామెంట్లకు ఘాటుగా స్పందించింది. అలనాటి నటుడు తన పై కొన్ని కామెంట్లు చేశారని.. ఆ నటుడు తన వేసుకునే డ్రెస్ చేంజ్ పైన చాలా నీచంగా మాట్లాడాడు అని ఆమె చెప్పుకొస్తోంది. ఎలాంటి దుస్తులు ధరించాలి వాళ్ళ వ్యక్తిగత వృత్తే డిసైడ్ చేస్తూ ఉంటుందని చెప్పుకొచ్చింది అనసూయ.

ఇక అనసూయ ఇలా కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలు బాగా హైలెట్ గా మారాయి. ఆ నటుడు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు, చాలా అశ్లీలమైన దుస్తులు ధరించినప్పుడు సోషల్ మీడియా ఎందుకు అవన్నీ పట్టించుకోలేదని ఆమె తెలియజేస్తోంది. ఇక ఆ నటుడు చేసిన కామెంట్లు చాలా నీచంగా ఉన్నాయని చెప్పుకొస్తోంది. ప్రజలకు సమాజంలో జరిగే విషయాలను తెలియజేసే టప్పుడు వారి యొక్క ముందుగా వారి సంస్కరణ గురించి తెలుపు కొస్తే బాగుంటుంది అని అనసూయ చెప్పుకొస్తోంది.

పెళ్లై పిల్లలు ఉండికూడా, హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ, బట్టలు విప్పుతూ బాడీని చూపించిన హీరోలు మాత్రం ఈ సమాజంలో ఎవరు ప్రశ్నించారని అనసూయ కామెంట్ రూపంలో తెలియజేస్తోంది. ఇక ఈ విషయం ఒక సీనియర్ నటుడి గురించే చేసింది అన్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆ నటుడు మరి ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి. లేదా అనసూయ తన డ్రెస్ సేన్స్ మార్చుకుంటుందేమో  వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: