ఈ ఏడాది అక్కినేని హీరో లు అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ వరకు బాగానే కలిసి వచ్చిందనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ చిత్రం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాగా అది సూపర్ హిట్ అయ్యింది.  అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమానే హౌస్ ఫుల్ అవుతూ ఉండడం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి నిదర్శనం.

ఇకపోతే దసరా సందర్భంగా అక్కినేని అఖిల్ కూడా తన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా భార్య భర్తలను అలాగే కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా బాగా అలరిస్తుంది అని చెప్పవచ్చు. ఆ విధంగా మూడు సినిమాలుగా దక్కని తొలి విజయం అక్కినేని అఖిల్ కు నాలుగో సినిమా ద్వారా అందింది.

అలా ఈ ఇద్దరు అక్కినేని హీరోలు 2021 వ సంవత్సరం లో చేరి భారీ హిట్ అందుకొని తమ తదుపరి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. వాటి పై అంచనాలను కూడా పెంచారు. అక్కినేని నాగచైతన్య విక్రమ్ కుమార్ తో కలిసి థాంక్యూ అనే ఓ విభిన్నమైన చిత్రాన్ని చేస్తుండగా అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డితో కలసి ఏజెంట్ అనే యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు. ఈ ఇద్దరు రాబోయే ఈ సినిమాలతో కూడా ప్రేక్షకులను మరింతగా అలరించాలని భావిస్తున్నారు. ఇక అటు అక్కినేని నాగార్జున కూడా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్న నాగార్జున నాగ చైతన్య తో కలసి బంగార్రాజు అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: