ఇక వరసగా మూడు ఫ్లాపుల తర్వాత బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి వచ్చిన అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టి సక్సెస్ అయ్యాడు.అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని హిట్ అయ్యింది.ప్రేమ కథా చిత్రాల దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మించడం అనేది జరిగింది.ఇక ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించి..తన అందంతో మరోసారి కుర్రకారుని ఆకట్టుకొని హాట్ నెస్ తో కట్టిపడేసింది.ఇక భారీ అంచనాలతో దసరా పండుగకు విడుదలైన ఈ సినిమాకు మంచి హిట్ టాక్ అనేది వచ్చింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకి వసూళ్లు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి.

ఇక 5 రోజుల్లోనే ఈ సినిమా 100 శాతం రికవరీ వెనక్కి తెచ్చేసింది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా ఈ సినిమా మంచి అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది.ఇక అలాగే టాలీవుడ్ లవర్ బాయ్ గా మంచి పేరున్న నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరి' సినిమా కూడా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నాగార్జున చాలా ఆనందంగా వున్నాడు. తన ఆనందాన్ని ఈ సినిమా సక్సెస్ మీట్ లో నాగార్జున షేర్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో యుఎస్‌లో కూడా మంచి వసూళ్ళని రాబడుతుంది. ఇక విడుదల అయిన కొద్ది రోజులకే యూఎస్ లో ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కును కూడా బద్దలు కొట్టేయడం అనేది జరిగింది.ఇక ఇప్పుడు ఆ సినిమా అలవోకగా యూ ఎస్ లో మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది. ఇక తన కుమారులు ఇద్దరూ కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు అందుకోవడంతో నాగార్జున పట్టరాని సంతోషంతో చాలా హ్యాపీగా వున్నాడు.కొడుకులు ప్రయోజకులు కావడంతో నాగార్జున ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: