1979 అక్టోబర్ 10వ తేదీన ప్రభాస్ జన్మించారు. ప్రభాస్ జాతకం గురించి జ్యోతిష్కులు ఏం చెబుతున్నారంటే.. లగ్నం జాతకం గా చూసుకున్నట్లయితే అతి సామాన్యుడు జాతకం గా.. ఈ జాతకం ఉన్న వాళ్ళు ఇంత పొజిషన్ సాధించలేరు అన్నట్లుగా తెలిపారు. కానీ రవి లగ్నం నుంచి చూసుకున్నట్లయితే అద్భుతమైన జాతకమని జీవితంలో మరెన్నో సాధించగలిగే గొప్ప జాతకం అని చెబుతున్నారు.. అంతేకాదు అతి త్వరలోనే అంతర్జాతీయ నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటాడు అని వారు చెప్పడం గమనార్హం.
ఒక సినీ ఇండస్ట్రీలో గొప్ప నటులు గా గుర్తింపు పొందిన ఎంజీ రామచంద్రన్, నందమూరి తారక రామారావు, రజనీకాంత్ లాంటి గొప్ప స్టార్ హీరోల రేంజ్ కు ప్రభాస్ కూడా ఎదిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.. భవిష్యత్ తరాల వాళ్లు కూడా ప్రభాస్ అంటే ఒక గొప్ప నటుడు అని గుర్తుండిపోయేలా తన జాతకం ఉందని వారు చెప్పడం గమనార్హం. ఈ విషయం విన్న ప్రభాస్ అభిమానులంతా ఆనందోత్సాహాలతో సందడి చేసుకుంటున్నారు.రాబోయే రెండేళ్లలో అన్నీ కలిసొస్తే ప్రభాస్ వివాహం చేసుకుంటాడంటున్న జ్యోతిష్యుడు.