ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో అఖండ అనే సినిమా తెరకెక్కింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా లాంటి బ్లాక్బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాతవచ్చిన లెజెండ్ సినిమా కూడా అందరినీ ఎంతగానో ఆకర్షించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి వస్తున్నా అఖండ సినిమా పై ఒక రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఈ ఏడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.


 ఎట్టకేలకు  బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ  సినిమా విడుదలకు సిద్దం అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే డిసెంబర్ 2వ తేదీన అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకధీరుడు రాజమౌళి కూడా వచ్చారు. రాజమౌళితో పాటు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా రావడం గమనార్హం. ఇకపోతే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన రాజమౌళి బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించారు. బాలయ్య అఖండ మూవీతో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏకంగా ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపు తీసుకువచ్చారని రాజమౌళి అన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఎనర్జీ పై ప్రశంసలు కురిపించారు రాజమౌళి. బాలకృష్ణ ఒక ఆటం బాంబు ఆ ఆటం బాంబును ఎలా ఉపయోగించాలి బోయపాటికి చాలా కరెక్ట్ గా తెలుసు అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. ఆ సీక్రెట్ మీ దగ్గరే దాచుకుంటే కుదరదు.. మాకు కూడా చెప్పాలి అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. ఇక బాలయ్య కూడా ఎనర్జీ సీక్రెట్ చెప్పాలని
..  ఈ ఏజ్ లో కూడా ఆ స్టెప్పులు ఆయన ఎనర్జి ఏంటి సార్ అంటూ ప్రశంసలు కురిపించారు రాజమౌళి. కాగా మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో బాలయ్య కొత్త కొత్త డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: