సినీ హీరో అమితాబ్ బచ్చన్ గురించి కొత్తగా ఏం పరిచయం చేయనవసరం లేదు. ఈ వయసులో కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాడు. అంతేకాదు దేశం మెచ్చిన నటుడిగా అమితాబ్ బచ్చన్ గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీలో బిగ్ బీ గా పేరు తెచ్చుకోవడం గమనార్హం. ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో ఉండే తారల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలియదు అని చెప్పాలి. కానీ అమితాబ్ గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎవరిని అడిగిన ఇట్టే చెప్పేస్తారు. అయితే అమితాబ్ లో మనకు తెలియని మరో కోణం కూడా ఉందని ఎంత మందికి తెలుసు..?

అదేమిటంటే సినిమాల ద్వారా,  వ్యాపార రంగాల ద్వారా సంపాదించిన ఆస్తులలో ఇళ్లను  నిర్మించి , వాటిని అద్దెకు కూడా ఇస్తూ ఉంటారు. అయితే నెల వచ్చేసరికి అద్దె రూపంలో వచ్చే ఆదాయం కూడా ఆయనకు భారీగానే ఉంటుందట. తాజాగా అలాంటి డీలే ఒకటి పూర్తి చేశాడు.. ఆయన డీల్ చేసిన ఒక విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అదేమిటంటే అమితాబ్ తనకు చెందిన ఒక ప్రాపర్టీని ప్రముఖ స్టార్ హీరోయిన్ కృతిసనన్ కు  ఇవ్వడమే సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడం.

అసలు విషయంలోకి వెళ్తే ముంబై సౌత్ అంధేరిలో ఒకడు ఫ్లాట్ ను అమితాబచ్చన్ కొనుగోలు చేశారు. ఆయన అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న కొన్ని రోజులలోనే చాలా మంది సెలబ్రిటీలు ఆ ఇంటిని అద్దెకు తీసుకోవాలని ప్రయత్నించారు.. అంతే కాదు ఆ ఫ్లాట్ కావాలని అమితాబ్ ను కూడా సంప్రదించారట. కానీ ఆ అవకాశం మాత్రం ప్రముఖ సినీ నటి కృతి సనన్ కు మాత్రమే దక్కింది.. కృతి సనన్ నుంచి ఈ డూప్లెక్స్  ఫ్లాట్ కోసం అమితాబ్ చేసే రెంట్ లెక్క తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఇకపోతే నెలకు రూ. పది లక్షల చొప్పున ఆ  ఇంటికి అమితాబ్ రెంట్ డిసైడ్ చేసారట. ఇక ఇందుకు కృతిసనన్ కూడా ఓకే చెప్పింది.  సెక్యూరిటీ డిపాజిట్ కింద ఏకంగా రూ. 60 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఇకపోతే వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2021 అక్టోబర్ 16వ తేదీ నుంచి 2023 అక్టోబర్ 15వ తేదీ వరకు అంటే 2 యేళ్ళ పాటూ  ఈ డూప్లెక్స్ ఫ్లాట్ యొక్క తాళాలు కృతిసనన్ చేతికి వెళ్లనున్నాయి. అమితాబచ్చన్ 2020 డిసెంబర్ లో రూ.31 కోట్లను వెచ్చించి మరీ ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. 2021 జనవరిలో ఇది ఆయన హ్యాండోవర్ చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ ఇంటి యొక్క విస్తీర్ణం 5184 చదరపు అడుగులు. అంధేరీలోని లోకండ్ వాలా రోడ్డు లో ఉన్న బంగ్లా లో 27, 28 అంతస్తుల్లో అమితాబ్ ఫ్లాట్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: