ఈ నేపథ్యంలో బన్నీ అవలంబించిన ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ప్రభాస్. ఆయన హీరోగా నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది చాలా పెద్ద సినిమా కావడం భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించబోయే సినిమా కావడంతో ఈ సినిమా రెండు భాగాలుగా రావడం నీ ప్రేక్షకులు అక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా రెండు భాగాలుగా తెరపైకి వచ్చాయి కానీ అవి ప్రేక్షకులను ఏమాత్రం మెపించలేదు. కానీ పుష్ప సినిమా రెండు భాగాలుగా వచ్చిన తర్వాత అనూహ్యంగా భారీ స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకుంది.
దాంతో ప్రభాస్ తన సలార్ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ వేసాడు. నిన్నటిదాకా ఈ సినిమా ఒక భాగంగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించిన అందరూ ఇప్పుడు సడన్ గా రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నాడు అని చెప్పగానే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది యూనిట్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి