ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల కళ్ళు అన్నీ కూడా ఒక్క భీమ్లా నాయక్ సినిమా పైనే ఉన్నాయి. ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఈ రోజు రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంటుంది. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో విడుదల కాబోతున్న పెద్ద సినిమా కావడంతో అందరూ కూడా ఈ చిత్ర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఓవైపు ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ తోడవడంతో ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అన్న అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా ఫంక్షన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు మంత్రివర్యులు కేటీఆర్ కూడా హాజరు కావడం ఒక్కసారిగా రాజకీయంగా ఎంతో చర్చనీయాంశం అవుతుంది. ఈరోజు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో ను ఎంతో హుషారుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ పీ నుంచి కూడా రాజకీయ నాయకులను ఎవరైనా పిలిచారా అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ అప్డేట్ ఉండబోతుందని విషయం అందరూ వ్యక్తం చేస్తున్నారు.
సినిమాను 25వ తేదీన ప్రకటిస్తున్నట్లు గా ప్రకటించారు కానీ ట్రైలర్ విడుదల గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే చిత్ర నిర్మాత బుకింగ్స్ గురించి అప్డేట్ ఇచ్చిన సమయంలోనే విడుదల గురించి కూడా చెప్పేసి వారికి ఈ రోజు ట్రైలర్ విడుదల కాబోతున్న విషయం చెప్పాడు. దాంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే టికెట్ ధరలు విషయం లో పవన్ రాజకీయం గా విమర్శలు చేసి చాలా లాభపడ్డారు పవన్. అయితే ఈ విషయం లో సినీ పెద్దలు జగన్ ను కలవడం వారు కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ విషయం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి