పాన్ ఇండియా సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే యాక్షన్ సీన్లకి అడ్రెస్ గా నిలుస్తుంటారు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటే దానికి ప్రధాన కారణం… రాజమౌళి అతనితోనే యాక్షన్ యాంగిల్ ను దేశమంతా కూడా ప్రెజెంట్ చేయడం వల్లనే.ఏ హీరో కూడా ఫైట్ చేసినా ఎంతో కొంత అతిశయోక్తి అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభాస్ ఫైట్స్ చేస్తుంటే మాత్రం అతని కటౌట్ కు తగ్గట్టుగా..చాలా కరెక్ట్ గా అనిపిస్తుంటుంది. 'సాహో' సినిమా హిందీలో హిట్ అయ్యిందంటే దానికి కూడా ప్రధాన కారణం కూడా అదే..అయితే ఈసారి మాత్రం ప్రభాస్ మాత్రం పెద్ద రిస్కే చేస్తున్నాడు. 'రాధే శ్యామ్' సినిమా అనేది కంప్లీట్ లవ్ స్టోరీ అని షూటింగ్ మొదలైనప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇది మేజికల్ లవ్ స్టోరీ అని తెలిపి అందరినీ కూడా దెబ్బకు సర్ప్రైజ్ చేశారు.


ఇక తాజాగా రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ మరింతగా ఆసక్తిని పెంచింది. అయితే ఈ మూవీలో ఫైట్లు ఉండవు అంటేనే అభిమానులు బాగా నిరాశ చెందారు. ఈ సినిమా దర్శకుడేమో 'ఫైట్లు ఎందుకు ఉంటాయి ఇందులో విలన్ ఉంటేనే కదా.. ఫైట్లు ఉండడానికి' అంటూ మరో షాక్ ని ఇచ్చాడు.దీంతో ప్రభాస్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని అందరూ భావిస్తున్నారు. కాని ఇదో డిఫరెంట్ యాక్షన్ మూవీ అట. ఇందులో ఫైట్స్ లాంటివి లేకపోయినా ఇదో డిఫరెంట్ కమర్షియల్ మూవీ అట. ఇక ప్రేమకి విధికి జరిగే యుద్ధమే ఈ 'రాధే శ్యామ్' అని ట్రైలర్లో చూపించి బాగా చెప్పించారు.ఇక ఈ సినిమాలో అన్నీ ఆశ్చర్యకరమైన సీన్లే ఉంటాయట. ప్రేక్షకులందరినీ కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళడమే 'రాధే శ్యామ్' థీమ్. అది జరిగితే ఈ సినిమా హిట్ సాధించినట్టే అని టీం అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: