విజయ్ దేవరకొండ ఒకేసారి పూరి జగన్నాథ్ తో రెండు సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లైగర్ చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత జనగణమన సినిమాని కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా రెండు సినిమాలు ఒకే దర్శకుడితో చేయడం విశేషం. ఇకపోతే పూరీ జగన్నాథ్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రెండు సినిమాలను రూపొందించపోతున్నాడు.

అయితే ఈ సినిమాల విడుదల బ్యాక్ టు బ్యాక్ కాకుండా మధ్యలో ఇంకొక సినిమా చేసే విధంగా విజయ్ దేవరకొండ ప్లాన్ చేశాడట. లైగర్ సినిమా ఆగస్టులో విడుదల చేసిన తర్వాత శివ నిర్వాణ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడట. గీత గోవిందం లాంటి పూర్తిస్థాయి ప్రేమ కథ చిత్రం తో విజయ్ దేవరకొండ మరొకసారి ఈ సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ అంశాలు కూడా ఇందులో కీలకంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రం తర్వాత మళ్ళీ జనగణమన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు విజయ్ దేవరకొండ.

ఆ తర్వాత విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సుకుమార్ దర్శకత్వంలోని సినిమాను ఆయన చేయబోతున్నాడు. పుష్ప సినిమాతో భారీ స్థాయిలో క్రేజ్ ను అందుకున్న సుకుమార్ తదుపరి సినిమా కోసం అందరు హీరోలు పోటీ పడుతూ ఉండగా ఆ అవకాశాన్ని విజయ్ దేవరకొండ అందుకోవడం మరింత విశేషం. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. చిన్న హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఈ హీరో ఇప్పుడు పెద్ద దర్శకులతో వరుసగా సినిమాలు చేసే స్థాయికి ఎదగడం నిజంగా ఆయన అభిమానులను ఎంతో ఆనంద పరుస్తుంది. మరి వరుస పాన్ ఇండియా సినిమాలలో అందరు హీరోలు నటిస్తున్న వేల ఈ హీరో ఏ స్థాయి లో అందరిని ఆకట్టుకుంతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: