కియారా అద్వానీ బాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. 'కభీర్ సింగ్' హిట్‌తో స్టార్‌ లీగ్‌లో కూడా జాయిన్ అయ్యింది. ఈ క్రేజ్‌చూసే సౌత్‌లో పాన్‌ ఇండియన్ మూవీస్‌ ప్లాన్ చేస్తోన్న దర్శకులంతా ఈమెని అప్రోచ్ అవుతున్నారు. శంకర్, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్‌ ఇండియన్ మూవీలో కూడా అవకాశం అందుకుంది. రామ్‌ చరణ్‌ 'ట్రిపుల్ ఆర్'తో మళ్లీ బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. 'జంజీర్‌' ఫ్లాప్‌ తర్వాత హిందీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన చరణ్‌, 'ట్రిపుల్ ఆర్'తో నార్త్‌లో మంచి మార్కెట్‌ వస్తుందని ఆశపడుతున్నాడు. ఈ లెక్కలతోనే శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ మూవీకి కమిట్ అయ్యాడు చరణ్. దిల్‌ రాజు నిర్మాణంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకున్నారు.

శంకర్‌ సినిమాలకి ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. లార్జ్‌ స్కేల్ సినిమాలు తీస్తాడని, టెక్నికల్లీ ఫార్వర్డ్‌గా ఉంటాడనే ఒపీనియన్‌ ఉంది. అందుకే స్టార్ హీరోలంతా ఈ దర్శకుడితో సినిమాలు చేయాలనుకుంటారు. అయితే ఈ భారీ సినిమాల ఇమేజ్‌తో పాటు, శంకర్‌ సినిమాల్లో నటించిన హీరోయిన్ల కెరీర్‌ కష్టాల్లో పడుతుందనే సెంటిమెంట్‌ కూడా ఉంది. శంకర్‌ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయినా సరే, అందులో నటించిన హీరోయిన్లకి మాత్రం కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఐశ్వర్యారాయ్‌ నుంచి మొదలుపెడితే, ఎమీ జాక్సన్ వరకు చాలామంది శంకర్‌ సెంటిమెంట్‌తో స్లో అయ్యారు. శంకర్‌ దర్శకత్వంలో 'రోబో' చేశాక ఐశ్వర్యా రాయ్‌కి 5 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్ అయింది.

ఇలియానా తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా హంగామా చేస్తోన్న సమయంలో శంకర్‌ దర్శకత్వంలో 'నన్బన్' సినిమా చేసింది. హిందీ హిట్ 'త్రీ ఇడియట్స్' రీమేక్‌గా వచ్చిన 'నన్బన్'కి మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. ఇక ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఇలియానాకి తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కొన్నాళ్లు హిందీలో హంగామా చేసినా, ఇప్పుడు బాలీవుడ్ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఇలియానా కెరీర్‌ ఎండింగ్‌కి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: