ఏదైనా సినిమా పరిశ్రమలో ఒక కొత్త హీరో ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేసి టాప్ హీరోగా ఎదిగితే ఇతర హీరోలు ఆ హీరో పట్ల కొంత జలసీ చూపుతూ ఉండడం సహజం. కానీ జేలసీ చూపించడం వరకు ఓకే అంతకన్నా ముందుకు వెళితే మాత్రం సదరు హీరో ఏ విధంగా స్టార్ హీరో అయ్యాడు అన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కాదు. ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ అనే కాదు అన్ని సినిమా ఇండస్ట్రీలలో వారసుల హవా జరుగుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో తమ వారసుడు సినిమా పరిశ్రమను ఏలాలి అని నెంబర్ వన్ స్థానంలో ఉండాలని అనుకోవడం లో ఏమాత్రం తప్పులేదు. కానీ అది సినిమాల ద్వారా స్వతహాగా వస్తే దాన్ని స్వాగతించాల్సిన విషయమే. అలా కాకుండా ఒకరినీ తొక్కేసి మరొకరునీ పక్కన పెట్టి పైకి రావాలి అనుకోవడం నిజంగా తప్పు. అలాంటి విషయాల్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొంత ఎదగాలని చెప్పాలి. మంచి సినిమాలను చేస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ సినిమా పరిశ్రమ లోని స్టార్స్ కొత్తగా వచ్చి హీరోలు గా నిలదొక్కు కుంటున్న వారి పట్ల కొంత అభద్రతాభావాన్ని చూపిస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తోటి స్టార్ హీరో ఏమడిగిన ఏది అడిగిన చేసే హీరోలు ఓ కొత్త హీరో స్టార్ హీరో అయితే ఎందుకు జీర్ణం చేసుకోలేక పోతున్నారు తెలియదు కానీ ఇప్పుడు ఆ హీరోకు అవకాశాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని చెప్పవచ్చు. ఇది ఎక్కువగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే జరగడం మన హీరోల అభద్రతా భావాన్ని క్లియర్ గా స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమందికి అదృష్టం కలిసి కష్టం ఫలించి సినిమా పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదుగుతున్న ఆరు అలాంటివారు అభినందించాల్సిందే పోయి వారు నిరాశ పడే విధంగా వెనకడుగు వేసే విధంగా చేయడం నిజంగా ఇండస్ట్రీ పెద్దల కు ఏ మాత్రం న్యాయం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: