కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాలకు ఎంతగానో డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఆయా సినిమాలను చూడాలని ప్రేక్షకులలో ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కేవలం కంటి చూపుతోనే ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పటి వరకు
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చిన్న చిన్న తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ వారం ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల కాబోతున్న
సినిమా ఒకటి అందరినీ ఎంతో ఆసక్తి పరిచే
సినిమా గా నిలిచింది.
ఏజెంట్ సాయి శ్రీనివాస
ఆత్రేయ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు స్వరూప్ ఇప్పుడు తన రెండవ ప్రయత్నంగా మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతుండగా ఇటీవలే విడుదలైన ఈ
సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.
తాప్సి హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా లో ముగ్గురు పిల్లలు ఏ విధంగా తాము అనుకున్న పనిని నెరవేర్చారు అనేదే ఈ
సినిమా కథ. ఈ చిత్రం పై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
చాలా రోజుల తర్వాత తాప్సీ
హీరోయిన్ గా తెలుగులో చేస్తున్న
సినిమా కావడంతో దీనిపై అందరూ ఎంతో ఆసక్తి ని కనబరుస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం చూడాల్సిందే అంటున్నారు. దానితో పాటు మంచి కథ ఉన్న కంటెంట్ కావడంతో ఈ
సినిమా చూడడానికి అందరూ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు
ఆర్ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ చిన్న చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ట్రైలర్ అప్ డేట్స్ బాగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో కొంతమంది ఈ
సినిమా పై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటుందో చూడాలి.