దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చి చివరికి మార్చి 25 వ తేదిన విడుదలైంది. అయితే ఇక ఈ సినిమా అనుకున్నట్లుగానే సెన్సేషన్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు వరకు ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా అంతకుమించిన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. మరోసారి రాజమౌళి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు.


 అయితే ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మల్లి అనే పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఇక ఈ పాత్రలతోనే సినిమా స్టోరీ కూడా మొదలవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ పాత్రలో నటించిన ట్వింకిల్ శర్మ అనే చిన్నారి పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పోసింది. కనిపించింది కొంతసేపు అయినా ఆ చిన్నారి చూపించిన హావభావాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి.  అయితే ఈ సినిమా ప్రారంభం సమయంలో మల్లి పాత్ర కొమ్మ ఉయ్యాల కోన ఉయ్యాల అనే పాట పాడుతుంది.


 ఇక ఈ పాట పాడింది ఎవరు అనే సోషల్ మీడియా వేతకగా ప్రకృతి రెడ్డి అనే చిన్నారి పాట పాడింది అన్న విషయం అందరికీ తెలిసిపోయింది.  ఇప్పుడు కొమ్మ ఉయ్యాల కోన ఉయ్యాల అనే పాటకు సంబంధించి మరో వార్త వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రకృతి రెడ్డి వయసు 12 ఏళ్ళు.. అయితే కొమ్మ ఉయ్యాల పాట రికార్డింగ్ చేసిన సమయంలో మాత్రం ప్రకృతి రెడ్డి వయసు కేవలం తొమ్మిదేళ్లే కావడం గమనార్హం. ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా 2022 లో విడుదలైన ప్పటికీ కొమ్మ ఉయ్యాల పాట రికార్డింగ్ చేసింది మాత్రం 2019లో మార్చి 15వతేదీన చేశారట. ప్రసాద్ ల్యాబ్లో పాటకు సంబంధించి రికార్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ప్రకృతి రెడ్డి పై ప్రశంసలు కురిపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr