చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అయిన సంగీత సజిత్ ఆదివారం ఉదయం తిరువనంతపురంలో మరణించడం జరిగింది. ఈమె ప్రస్తుత వయసు 46 సంవత్సరాలు. సంగీత గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందుకోసం చికిత్స కూడా చేయించుకుంటున్నాట్లగా తెలుస్తోంది. అయితే ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో సంగీత తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలియజేశారు. సంగీత అకాల మరణం పట్ల సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు సైతం ఒక్కసారిగా కన్నీరుమున్నీరవుతున్నారు.


ప్లే బ్యాక్ సింగర్ సంగీత మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం వంటి భాషలలో కూడా పాటలను పాడింది. ఇప్పటివరకు ఈమె 200కి పైగా చిత్రాలలో పాటలు పాడిన ట్లు సమాచారం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన తమిళ్ సినిమా మిస్టర్ రోమియో సినిమాల్లో కూడా ఈమె పాడిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అంతే కాకుండా పృథ్వి రాజ్ నటించిన కురుతి సినిమాకు సంబంధించిన వాటిలో టైటిల్ సాంగ్ పాడడం కూడా జరిగింది. ఇక ఇదే ఈమెకు చివరి పాట.

1992 వ సంవత్సరంలో తమిళ సినిమా నాళయ్య తీర్పు ఈ సినిమాతో మొదటి సారిగా తన సంగీతాన్ని అందించింది. 2020లో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు ఒక పాట పాడింది. సంగీత అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి  పినరాయి విజయన్ , నేపథ్య గాయని కెఎస్ చిత్రం ఇతర గాయకులు కూడా ఈమెకు సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సజిత్ మరణంతో ఆమె కుటుంబ సభ్యులు అభిమానులు సైతం చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: