త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పవర్ ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటైన వీరి కలయికలో మూడో
సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూడగా ఇన్ని రోజులకు వీరి కాంబినేషన్ లో
సినిమా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే
త్రివిక్రమ్ మహేష్ బాబు కలయికలో
సినిమా వస్తుంది అని తెలిసిందో అప్పటినుంచి ఈ సినిమాలో మహేష్ ను
త్రివిక్రమ్ ఏవిధంగా చూపిస్తాడు అన్న ఆసక్తి మొదలయింది.
అంతేకాదు ఎలాంటి కథను తయారు చేశాడు, ఏ తరహాలో మహేష్ ను ఎలివేట్ చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలనే డిమాండ్ మహేష్ అభిమానుల్లో నెలకొంది. వాస్తవానికి ఈ
సినిమా స్థానంలో
ఎన్టీఆర్ తో
సినిమా చేయాలని అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ
ఎన్టీఆర్ పాన్
ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో ఉండడంతో
త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్ట వలసి వచ్చింది. మహేష్ బాబు కు మంచి కథ చెప్పి ఒప్పించిన
త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని కూడా పాన్
ఇండియా స్థాయిలోనే చేయాలని అభిమానులు కోరుతున్నారు.
అయితే చాలా రోజులుగా ఈ
సినిమా షూటింగ్ మొదలు కాకపోవడం మహేష్ అభిమానులను ఎంతగానో అసహన పరుస్తుంది. స్క్రిప్ట్ ఓకే అవడానికి కూడా ఇంతటి సమయం పడుతున్న నేపథ్యంలో ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు విడుదల అవ్వాలి ఎప్పుడూ దాన్ని చూడాలి అన్న అసహనం ఆయన అభిమానుల్లో నెలకొంటుంది. అంతేకాదు స్క్రిప్టు విషయంలో మాత్రం చాలా సార్లు మార్పులు చేర్పులు చేయడం కూడా నెగెటివ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు మహేష్ అభిమానులు. ఇంకా ఈ
సినిమా స్క్రిప్ట్ ఓకే కాకపోవడం అందరినీ కలవరపరుస్తోంది. తాజాగా ఈ
సినిమా ఫైనల్ నేరేషన్ కోసం విదేశాలకు వెళ్లారు చిత్రయూనిట్. అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా
సినిమా ఓకే అయితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.