అక్కినేని నాగచైతన్య హీరోగా ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరోగా మంచి మార్కెట్ కలిగి ఉన్న ఈ హీరో వరస సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఓటీటీ లో కూడా ఆయన నటించడం అభిమానులను ఎంతో ఆనందపరుస్తుంది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకులలో సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. గతంలో సినిమాలు చూడాలంటే థియేటర్లలో చూడడానికే ఎక్కువగా అవకాశం ఉండేది ప్రేక్షకులకు. 

కానీ ఇప్పుడు టీవీలో ఓటీటీ ల రూపంలో సినిమాలు దర్శనమిస్తున్నాయి. చిన్న హీరోలే కాదు పెద్ద హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ లో ఎక్కువగా పెద్ద హీరోలు ఈ తరహా ప్రాజెక్టులలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అది తెలుగుకి కూడా పాకింది అనడానికి ఇదే నిదర్శనం. కొంతమంది తెలుగు హీరోలు ఇప్పటికే తెలుగులో వెబ్ సిరీస్ లో నటించి కం బ్యాక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య కూడా ఇలా నటించడం మరికొంతమంది యువ హీరోలు ఈ తరహా సినిమాలలో నటించడానికి ఊతం అవుతుంది. అలా అక్కినేని నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.  అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ విడుదల కాబోతుంది.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ కు దూత అనే టైటిల్ లో నిర్ణయించారు. వీరిద్దరి కాంబినేషన్ లోని థాంక్యు అనే సినిమా జూలై 22వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దూత వెబ్ సిరీస్ పై వారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వెబ్ సిరీస్ ఆగిపోయిందని వస్తున్న వార్తలకు వారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో క్లారిటీ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఆగిపోలేదని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: