నందమూరి కుటుంబం నుంచి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న హీరోలలో ఒకడు కళ్యాణ్ రామ్. సినిమా పరిశ్రమకు వచ్చి చాలా రోజులే అవుతున్న కూడా ఈ హీరోకి స్టార్ హీరో స్టేటస్ రాలేదని చెప్పాలి. అయినా కూడా పట్టు వదలైన విక్రమార్కుడులా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా పటాస్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని మంచి జోష్ మీద ఉన్న ఈ హీరో ఇప్పుడు బింబి సారా అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యొక్క ట్రైలర్ నిన్న విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరు ఎంతగానో ఫిధా అయ్యారని చెప్పాలి. కేథరిన్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా కు కొంత ఫాంటసీ టచ్ కూడా ఉందని చెప్పాలి. గతంలో ఇలాంటి తరహా సినిమాలలో కళ్యాణ్ రామ్ నటించిది లేదు. కథ కథనాలు సరికొత్తగా ఉండబోతున్నాయని ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. మరి ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో త్వరలోనే తెలుసుకుందాం. 

ఇక పోతే కళ్యాణ్ రామ్ ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో అందరి హీరోలు ఈ తరహా సినిమాలు చేసే సక్సెస్ అవుతున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా ఆపిల్ ఉన్న నేపథ్యంలో ఈ కథను ఆ స్థాయిలో తీసుకురావడానికి సిద్ధం చేశాడు. ఇక మరొక పాన్ ఇండియా సినిమాను కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించడానికి సిద్ధమవుతున్నాడు ఈ హీరో. డెవిల్ అనే సినిమాతో ఆయన రాబోతున్నాడు. మరి సక్సెస్ విషయంలో కాస్త తడబడుతున్న కళ్యాణ్ రామ్ ఈ రెండు చిత్రాలతో మంచి సక్సెస్ అందుకొని క్రేజీ హీరోగా మారతాడు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: