సినీ ఇండస్ట్రీలోకి కష్టపడి పైకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు.. నీకు అంతే కాకుండా అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయాలను అందుకున్న వారు కూడా ఉన్నారు ముఖ్యంగా విలన్స్ గా వచ్చిన వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నటులలో విలన్ నితిన్ మెహతా కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే ఈ విలన్ ని పేరుతో చెప్పడం కంటే అఖండ సినిమాలోని విలన్ అని చెబితే టక్కును గుర్తుపడతారు. బాలకృష్ణకి ఎదిరించి నిలబడిన విలన్ పాత్రలో అదరగొట్టేసాడని చెప్పవచ్చు. అఖండ సినిమాలో గజేంద్ర సాహువుగా నటించాడు నితిన్ మెహతా .


ఈ సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈయన కుల ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.నితిన్ మెహతా  21 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీలో సేవలు అందించారట. ఇక ఈయన మాట్లాడుతూ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత తన లుక్ లో కొంచెం చేంజ్ చేసుకున్నాను అని తెలిపారు. గడ్డం పెంచి కొత్త లుక్ ట్రై చేశాను కానీ సినిమాలలోకి రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు.

అలా ఒకసారి హైదరాబాదు ఎయిర్పోర్టులో ఒక ఫిలిం డైరెక్టర్ తన చూశారని ఆ తర్వాత ఢిల్లీలో మొదటిసారిగా మోడల్గా కనిపించాను ఆ తర్వాత యాడ్లలో కూడా నటించాలంటూ తనకి కాల్స్ కూడా వచ్చాయట. అలా సినిమాల్లోకి వచ్చాను అని తెలిపారు. అయితే సినీ జర్నీ బాగానే ఉందని తెలిపారు. ముఖ్యంగా సౌత్ లో తన జర్నీ బాగా ఉందని తెలిపారు చిరంజీవి నాగార్జున మహేష్ అల్లు అర్జున్ తదితర హీరోలతో విలన్ గా ఫైట్ చేయాలని ఉంది అని తెలిపారు. అఖండ సినిమాలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది అని తెలియజేశారు. బాలయ్య బాబుతో పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని తెలుపుతూ ఆయనతో పని చేస్తున్నప్పుడు ఇండస్ట్రీకి నేను కొత్త వాడిని అన్న భావన కూడా కలగలేదని తెలిపారు. ప్రస్తుతం రావణాసుర, స్పై, మునుముందు తదితర చిత్రాలను నటిస్తున్నట్లుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: