బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చే హీరోలకు ఎటువంటి అండ దండ ఉండదు అనడానికి తాజాగా జరుగుతున్న ఓ పరిణామమే ఉదాహరణ. స్వతహాగా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఓ మోస్తరు హీరోయిన్ గా రాణిస్తున్న ఓ హీరో తన సినిమాను విడుదల చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. మంచి సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ కూడా ఈ హీరో తన సినిమా విడుదల పట్ల సినీ పెద్దలతో పోరాడుతూ ఉండడం నిజంగా అందరినీ ఎంతగానో కలవరపరిచే విషయం అనే చెప్పాలి.

ఒకే వారసత్వపు హీరో సినిమాకు ఇంతటి ఇబ్బంది మాత్రం కలగదనే చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు తన సినిమాను సినీ పెద్దలు చెప్పారని వాయిదా వేసుకున్న సదరు హీరో ఇప్పుడు మరొకసారి ఆ చిత్రాన్ని వాయిదా వేసుకోవడం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతో గందర గోళాన్ని సృష్టిస్తుంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ2 సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా గతంలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా సరికొత్త జోనర్ లో రూపొందగా ఈ సినిమా ఆసక్తి కరంగానే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులలో మంచి అంచనాలు కలిగిన ఈ సినిమా యొక్క అప్డేట్లు అందరిని ఎంతో ఆసక్తి పరిచగా విడుదల కు ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం ఎంతో బాధాకరం. నిఖిల్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అయితే ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడడం వంటివి జరగడంతో వారిలో ఎంతో నిరాశ కలిగింది. ఫైనల్ గా ఈ చిత్రాన్ని ఆగస్టు 12వ తేదీన విడుదల చేయడానికి నిఖిల్ నిర్ణయించుకోగా దానిని కూడా సినీ పెద్దలు మార్చమని ఆయనను వేధించడం జరిగిందట. దాంతో 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేసుకోలేక తప్పలేదు. ఫైనల్ గా ఈ చిత్రాన్ని 13వ తేదీకి మార్చడం సినిమా వసూళ్లపై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: