బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న వారిలో దీపిక పడుకొనే కూడా ఒకరు. గ్లామర్ రోల్స్ తో పాటు హీరోయిన్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది స్టార్ హీరోల సినిమాలో మొదటి హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని సమస్యలతో ఆమె సూసైడ్ చేసుకోవాలనుకుందట వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.


దీపిక పడుకొని ఎన్నో సందర్భాలలో డిప్రెషన్ తో పోట్లాడడం జరిగిందట ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో తన జీవితంలో జరిగిన మెంటల్ హెల్త్ గురించి కొన్ని విషయాలను తెలియజేస్తుంది మానసిక అనారోగ్యం అనేది ఒకరీ వృత్తిపరమైన విజయానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలియజేసింది. అయితే తనకు తెలియకుండానే ఏడ్చేదానినని ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడు నిద్ర పోవాలా ఆత్మహత్య చేసుకోవాలనిపించేదనిర్  తెలియజేసింది. డిప్రెషన్ ఉన్న సమయంలో తన తల్లి ఉజ్జల తనకు తోడుగా నిలిచింది అని దీపిక పడుకొనే తెలియజేసింది. ఇక అటువంటి లక్షణాలు సంకేతాలు ముందే తన తల్లి గుర్తించి తనని చాలా జాగ్రత్తగా చూసుకునేదని తెలియజేసింది.డిప్రెషన్ పై విజయం సాధించిన దీపిక మానసిక ఒత్తిడి సమస్యలతో చాలా బాధపడే వారికి.. 2015లో లాభవేక్ష లేని.. ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ను ప్రారంభించిందట ఆ సంస్థ ద్వారా ఇలాంటి వ్యక్తుల జీవితం గురించి అవగాహన కల్పిస్తూ ఉంటున్నానని తెలియజేసింది ఇక తన కెరియర్ విషయానికి వస్తే ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది దీపికా పడుకొని ఆ తర్వాత ఓం శాంతి ఓం సినిమాతో మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో తప్ప ఇతర హీరోలతో నటించింది 2018 లో రణవీర్ సింగ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నది. ప్రస్తుతం తన కెరియర్ చాలా హ్యాపీగా ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: