మొన్నటిదాకా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు గడ్డు రోజులు ఉన్నాయి. అయితే పోయిన వారం రెండు సినిమాలు విడుదల అయ్యి ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి వేశాయని చెప్పవచ్చు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సారా చిత్రం అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలు రెండు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాలు ఘనవిజయం అందుకున్నాయి. ఒకదానికి మించి మరొకటి ఈ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ మంచి ఓపెనింగ్స్ ను కూడా రాబట్టుకున్నాయి.

చాలా రోజుల తర్వాత తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ప్రేమ కథ సినిమాలను బాగా చేసే దర్శకుడైన హను రాఘవపూడి తో కలిసి ఈ సినిమాను చేసిన దుల్కర్ సల్మాన్ యూత్ ను ఎంతగానో అట్రాక్ట్ చేశాడని చెప్పాలి. క్లాస్ ప్రేక్షకులను దుల్కర్ సల్మాన్ ఆ కొట్టుకుంటూ ఉండగా మాస్ ప్రేక్షకులను కళ్యాణ్ రామ్ ఆదరిస్తున్నాడు ఆ విధంగా ఈ ఇద్దరు అన్ని వర్గాల ప్రేక్షకులను అరటిస్తూ తమ సినిమాలకు మంచి కలెక్షన్లను అందుకుంటున్నారని చెప్పాలి. 

ఓవైపు వర్షాలు వస్తున్నా కూడా ఈ సినిమాల కలెక్షన్లకు ఏ మాత్రం డోకా రావటం లేదు. మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు ఆ సినిమాలను థియేటర్లలో చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఆ విధంగా ఈ రెండు చిత్రాలు ఈ వారాంతంలో భారీ కలెక్షన్లను సాధించడం ఖాయం అని చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విజయం ఈ సినిమాలతో అందుకోవడం నిజంగా మరింత విశేషం. మరి రాబోయే సినిమాలు ఈ విజయ పరంపర ను కొనసాగించి చిత్ర పరిశ్రమ యొక్క సక్సెస్ రేట్ ను మరింతగా పెంచుతాయా అనేది చూడాలి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రెండు చిత్రాలు రాబోతున్నాయి. ఒకటి నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కాగా మరొకటి నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా. ఇవి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: