ఖడ్గం సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే ఐటం పాటతో తెలుగు యువత మతులు పోగొట్టింది కిమ్ శర్మ. అయితే ఆమె తొలి సినిమా మగధీర అని చాలామంది అభిప్రాయపడతారు.


కానీ అంతకంటే ఏడేళ్ల ముందుగానే అంటే 2002లో, దర్శకుడు కృష్ణవంశీ సినిమా అయినా ఖడ్గంలో ఆమె నటించింది. ఇక కిమ్ శర్మ సినిమాలు వద్దు అనుకొని 2010లో కన్యా దేశానికి చెందిన బిజినెస్ మ్యాన్ అయినా అలీపుంజి అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండియా నుంచి వెళ్ళిపోయిందట.అయితే ఐదు సంవత్సరాలు గడవకుండానే 2016లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే కిమ్ శర్మ అలీ పుంజి యొక్క డబ్బును చూసే పెళ్లి చేసుకుందని అప్పట్లో అంతా కూడా భావించారు.


ఈ నేపథ్యంలో తనను భర్త వేధిస్తున్నాడు అంటూ అనేక ఆరోపణలు గుప్పించింది కిమ్. ఇక అదే ఆరోపణలతో కోర్టుకెక్కి విడాకులు సైతం తీసుకుంది. ఇక ఈ విడాకులకు ముందు ఆ తర్వాత కిమ్ శర్మ కొంతమందితో ప్రేమలో పడిందట . అందులో కొన్ని పెళ్లి వరకు వెళ్లగా అవి కార్యరూపం దాల్చలేదు. ఆమెతో ప్రేమాయణం నడిపిన ఆ స్టార్స్ ఎవరూ చూద్దాం.


  యువరాజ్ సింగ్ కిమ్ శర్మ సినిమాలో నటిస్తున్న కాలంలోనే యువరాజ్ సింగ్ తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిందట. కానీ యువరాజ్ తల్లికి ఆమె పై సదాభిప్రాయం లేకపోవడంతో వీరి డేటింగ్ కాస్త రిలేషన్ షిప్ గా మారకముందే బ్రేకప్ జరిగిపోయింది.  హర్షవర్ధన్ టాలీవుడ్, బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే చిన్న సినిమాలకు హీరోగా కెరియర్ కొనసాగిస్తున్న హర్షవర్ధన్ తో కిమ్ కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించింది. అవును, మాయా వంటి పలు చిత్రాలలో హర్షవర్ధన్ నటించగా బాలీవుడ్ లో సైతం సోనమ్ రే సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నాడు. కారణాలు ఏంటో తెలియదు కానీ కొన్నాళ్లకే వీరి డేటింగ్ కూడా ముగిసి పోయింది.  లియాండర్ పేస్ ప్రస్తుతం టెన్నిస్ దిగ్గజం అయిన లియాండర్ పేస్ తో కిమ్ శర్మ కొన్నాళ్లుగా పీకల్లోతో ప్రేమలో మునిగి తేలుతోంది. పేస్ సైతం ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడట.దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: