ఇప్పుడు ఎక్కడ చూసినా మృనాల్ ఠాగూర్ గురించే వినబడుతుంది.అయితే టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ మృనాల్ ఠాకూర్ రాబోయే రోజుల్లో టాప్ స్టార్ హీరోయిన్ గా నిలవడం ఖాయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే సీతారామం సినిమాలో సీత పాత్ర కు ఆమె ప్రాణం పోయడం తో పాటు సినిమా ప్రమోషన్ సమయంలో ఆమె మాట్లాడిన మాటలు మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.ఇదిలావుంటే తాజాగా ఆమె సీతారామం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేశాయి. 

అయితే ఆ ఇంటర్వ్యూలో మృనాల్ ను టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ప్రభాస్.. మహేష్.. ఎన్టీఆర్ లలో మీకు ఎవరితో నటించాలని ఉందంటూ ప్రశ్నించగా ఏమాత్రం ఆలోచించకుండా... వెంటనే తనకు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పేసింది.ఈకె ఎన్టీఆర్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం సినిమా ను చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో పాటు ఆయన డాన్సింగ్ స్టైల్ ను అంతా ఇష్టపడుతారు. ఇకపోతే అందుకే ఆయన తో నటించాలని మృనాల్ ఠాకూర్ కూడా కోరుకుంటుంది.అయితే  మరి మృనాల్ కి ఆ అవకాశం వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.

పోతే ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ తర్వాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. అయితే కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఇప్పటి వరకు ప్రారంభం అవ్వలేదు.అయితే  విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవుతుందేమో అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇప్పటికే బుచ్చి బాబు సినిమా ను మరియు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ను చేయబోతున్నాడు. అయితే మొత్తం మూడు సినిమాలు కూడా ఏడాదిన్నర గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఎన్టీఆర్ భావించాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: