విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేస్తున్నారు చిత్ర బృందం. హీరో విజయ్ దేవరకొండ అయితే ప్రతి ఒక్క నగరాన్ని దర్శించి అక్కడ తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఆ విధంగా లైగర్ ఫ్యాన్ డం టూర్ లో ఈరోజు ఇండోర్ నగరాన్ని దర్శిస్తున్న సినిమా బృందం రేపు సౌత్ లోని కేరళలోని కొచ్చిలో ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా గతంలో వచ్చింది.  సినిమా కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అనారోగ్యంతోనే ఆయన ఇన్ని నగరాలకు వెళుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలా కేరళలోని తన అభిమానుల కోసం ఇప్పుడు కొచ్చికి వెళ్లి తన సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటు నార్త్ లోనూ అటు సౌత్ లోనూ రెండు విధాలుగా విజయ్ దేవరకొండ తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమా పట్ల తన ఫ్యాషన్ ఏంటో తెలియపరుస్తున్నాడు. 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చార్మి మరియు కరణ్ జోహార్ ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా దాదాపు 5 భాషలలో విడుదల అవుతుండడం విశేషం. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా విడుదల కాబోతూ ఉండడంతో ఆయన అభిమానుల పట్ల ఎంతగానో సంతోషాలు కలుగుతున్నాయి.  మరి సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతగా కష్టపడుతున్న విజయ్ దేవరకొండ కోసమే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రెండు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూరీ దర్శకత్వంలోనే అయన తన తదుపరి సినిమా ను చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: