తమిళంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కమలహాసన్ హీరో విజయ్ దళపతి తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం సినిమాలో కాదట కమలహాసన్ నిర్మాణ బ్యానర్ పై విజయ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. సినిమా కోసం తమిళ ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వెట్రి మారన్ దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం. గడిచిన కొద్ది రోజుల క్రితం కమలహాసన్ ఈ విషయాన్ని మాట్లాడినట్లుగా కోలీవుడ్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి.


విక్రమ్ సినిమా ముందు వరకు కమలహాసన్ ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ విక్రమ్ సినిమా వల్లే తాను ఇప్పుడు ఎలాంటి అప్పులు లేకుండా ఉన్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది కమలహాసన్. అలాంటిది విజయ్ హీరోగా కొన్ని వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు అంటే అది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. అయితే విక్రమ్ సినిమాతో వచ్చిన లాభాల వల్ల కమలహాసన్ హీరో విజయ్తో సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక డైరెక్టర్ వెట్రీ మారన్ దర్శకత్వంలో సినిమా వస్తోందంటే ఇక ఆ సినిమా ఖచ్చితంగా క్రేజీ ప్రాజెక్టు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కమలహాసన్ నిర్మాతగా అంటే అదొక అద్భుతమై అన్నట్లుగా తమిళ ఇండస్ట్రీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. నిర్మాతక వ్యవహరించడంతోపాటు కమలహాసన్ ఆ సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా మరింత హైప్ పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాతగా కమలహాసన్ రాజు కమల్ అనే బ్యానర్ లో  ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఒకేసారి రెండు మూడు సినిమాలు అయినా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కమలహాసన్ సమాచారం. దీంట్లో కమల్ హాసన్ అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: