అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక రోజంతా బాగా విమర్శలకు గురయ్యాడు. ఒకవైపు కృష్ణంరాజు మృతి చెంది తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం తీవ్ర దుఃఖంలో మునిగి ఉంటే..
మరోవైపు తనకు సైమా అవార్డు వచ్చిందోచ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు బుద్ధి ఉందా అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఆయనను బూతులు తిడుతూ కొందరు తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్ లెజెండ్ కృష్ణంరాజు చనిపోయిన విషయంపై ఎలాంటి పట్టింపు కూడా లేదు కానీ తనకు వచ్చిన పుష్ప సైమా అవార్డు విషయంలో ఎందుకంత ఆత్రుత, ఆనందం అంటూ కొందరు అల్లు అర్జున్ ని ప్రశ్నించారు. ఆ ట్రోల్స్ కారణమో లేదంట మరేమో కానీ అల్లు అర్జున్ బెంగుళూరు నుంచి నేరుగా కృష్ణంరాజు ఇంటికి చేరుకొని కృష్ణంరాజు పార్ధివ దేహానికి నివాళులు అర్పించి, అక్కడే ఉన్న ప్రభాస్ ని కూడా పలకరించాడు.
ఆ సమయంలో ప్రభాస్ తో నవ్వుకుంట మాట్లాడడం ప్రభాస్ ఒకవైపు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చాలా బాధతో ఉంటే అల్లు అర్జున్ నవ్వినట్లుగా ఉండడంతో సోషల్ మీడియాలో మళ్లీ అల్లు అర్జున్ ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేవలం ప్రభాస్ ని పరామర్శించిన సమయంలోనే కాకుండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ నవ్వడం అందరికీ కూడా కాస్త ఇబ్బందిగానే అనిపించింది. ఈ సమయంలో నవ్వడం ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. మరి కొందరు మాత్రం అల్లు అర్జున్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ని సమర్థించడం అస్సలు సరికాదు అనేది చాలామంది అభిప్రాయం. ఏ చోటుకి వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరించాలి.. ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అల్లు అర్జున్ ఆ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలంటూ కొందరు అయితే కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి నిన్న అంతా కూడా అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఒక స్థాయిలో అయితే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలతో అయినా ఇక నుండి ఆయన పద్ధతి మార్చుకుంటాడో లేదో మరి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి