టాలీవుడ్
సినిమా పరిశ్రమలో ఒక సోలో
హీరో ఎదగడం వారసత్వపు పెద్ద హీరోలకు ఏమాత్రం నచ్చడం లేదని ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. ఇటీవల కాలంలో
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఓ
సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ
సినిమా బాగోలేదు ఆ విషయాన్ని చిత్ర బృందం కూడా ఒప్పుకుంది. అయితే ఇప్పటిదాకా ఏ ప్లాప్ సినిమాకి రానటువంటి నెగెటివ్ ఈ సినిమాకి రావడం పట్ల కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.
బాలీవుడ్ లోని ప్రముఖులు సైతం
విజయ్ దేవరకొండ సినిమాకి మాత్రమే ఈ విధమైన నెగటివ్ రావడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు
విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటానని గట్టి నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాడు. అయితే దానికి పూర్తి విరుద్ధంగా ఈ
సినిమా యొక్క ఫలితం బయటకు వచ్చింది. దాంతో
సినిమా బృందం మొత్తం ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయింది. ఎన్నో నమ్మకాలను పెట్టుకున్న ఈ
సినిమా ఇలా అయిపోవడం ఎవరూ కూడా దిగమింగుకోలేకపోయారు.
ముఖ్యంగా
విజయ్ దేవరకొండ అయితే ఈ
సినిమా ఈ విధంగా అవుతుందని ఏమాత్రం ఊహించి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై వచ్చిన నెగిటివ్ ను ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో ఈ సినిమాకు నెగిటివిటీ రావడం అనేది చూస్తుంటే కొంతమంది కావాలనే ఈ సినిమాపై దుష్ప్రచారం చేశారని అర్థమవుతుంది. మరి ఎవరు కావాలని ఈ
హీరో పై దుష్ప్రచారం చేశారో తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే
విజయ్ దేవరకొండ ఇకపై
సినిమా గట్టిగా ఉండేలా చూసుకోవాలని ఆయన అభిమానులు సలహాలు ఇస్తున్నారు కంటెంట్ పట్ల మరింత దృష్టి పెట్టాలని చెబుతున్నారు. దానికి తోడు
విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కూడా కొంత మార్చుకోవాలని చెబుతున్నారు లేదంటే అది సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు. ఆయన కెరియర్ బాగుండాలి అంటే అందరి హీరోల లాగానే ఈ
హీరో కూడా కెమెరా ముందు మాత్రమే కాదు వెనుక కూడా నటిస్తే బాగుంటుంది అనేది వారు చెప్పుకుంటున్నారు.