ప్రస్తుతం చిత్ర పరిశ్రమ యువ టాలెంట్ తో కళకళలాడుతుంది. కొత్త టాలెంట్ రావడంతో తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. రొటీన్ రొట్టె కథలకు మంగళం పాడి కొత్త కథలతో.. కథనాలతో సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తమ టాలెంట్ నే సాధనంగా సత్తా చాటుతున్నారు. ముదు షార్ట్ ఫిలింస్ తో సత్తా చాటి ఆ తర్వాత ఫీచర్ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ టీం అందరు కలిసి చేస్తున్న ప్రయత్నమే డిక్టెక్టివ్ డేవిడ్.

రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా చాప్టర్ 1 ట్రైలర్ నేడు రిలీజైంది. తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేత ఈ ట్రైలర్ రిలీజ్ చేయించారు. మనకి తెలియని కర్ణుడి జీవితం గురించి తెలుసుకుందాం అంటూ మొదలైన డిటెక్టివ్ డేవిడ్ చాప్టర్ 1 ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కలియుగ కర్ణుడి కథ అని చెప్పొచ్చు.    

డిటెక్టివ్ గా ఓ కేసు సాల్వ్ చేసే క్రమంలో అది ఎవరికోసమో కాదు తన కోసమే.. ఇన్నాళ్లు తను వెతుకుతున్న ప్రశ్నల సమాధానం కోసమే అని అర్ధమవుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి..? దానికి పరిష్కారం ఏంటి..? అన్నది మాత్రం సినిమాలో చూడాల్సిందే అంటూ డైరక్టర్ జావీద్ పాషా ఎక్సయిట్ అయ్యేలా చేశాడు. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. ముఖ్యంగా వెంకట్ ప్రవీణ్ సినిమాటోగ్రఫీ.. కలర్ అన్ని సినిమాలో హైలెట్ అయ్యేలా ఉన్నాయి. హీరో సూర్య భరత్ చంద్ర కూడా సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. తేజా క్రియేషన్స్ లో డి.నాగేశ్వర రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. డిటెక్టివ్ డేవిడ్ చాప్టర్ 1 ట్రైలర్ అదరగొట్టగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

 
 
   

మరింత సమాచారం తెలుసుకోండి: