టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు సినిమాలలో ఏ స్థాయిలో బిజీగా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాంకర్ గా తన కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెండితెరపై కూడా తన క్రేజ్ ను చాటుకుంది. హీరోలకు తగ్గ మార్కెట్ ను కలిగి ఉన్నా ఈ బొద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ కురకాలను అలరిస్తూ ఉంటుంది. టీవీ లలో ఉన్న యాంకర్లలో ఎక్కువ శాతం ట్రోల్ కి గురయ్యే నటి అనసూయ అనే చెప్పాలి. యాంకర్ గా చేసినప్పటికీ మొదటి నుంచి ఆమె సినిమాలలో నటించి రాణించాలన్న ఆసక్తి ఎక్కువగా కనిపించేది.

అందుకే అవకాశం వచ్చినప్పుడు కొన్ని కీలకమైన పాత్రలు చేస్తూనే ఇంకొక వైపు స్పెషల్ సాంగ్స్ లలో కూడా చేస్తూ అందరిని ఆకట్టుకునేది. అయితే రంగస్థలం సినిమా తర్వాత ఆమె అలాంటి పాటలలో ఎక్కువగా కనిపించలేదని చెప్పాలి. ఆ సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం ఈమె చేసింది అంటే ఆమెకు ఏ స్థాయిలో మార్కెట్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా చాలా రోజుల తర్వాత ఆమె ఒక స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ హీరోలుగా రాబోతున్న సినిమాలో ఈమె ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది అని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అని చెబుతున్నారు. ఒకవైపు షో లు, ఇంకొక వైపు సినిమాలు అంటూ బిజీగా మారిపోయిన అనసూయ ఇప్పుడు ఈ సాంగ్ ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలను అందుకుంటుందా అనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్లో మొదలు కాబోతూ ఉండగా అనసూయ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: