స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రంతో ఒక్కసారిగా భారీ క్రేజన సంపాదించారు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలోనే స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించిన అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఇక పుష్ప సినిమాలో పుష్ప రాజ్ గా తన నటన యాటిట్యూడ్ చూసినా నార్త్ ఆడియన్స్ సైతం అల్లు అర్జున్ కు కూడా అభిమానులు అయ్యారు. అయితే ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖుల సైతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిపోయారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన టైగర్ ష్రాఫ్ అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. ఇక తన అభిమానుల కోసం ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్  అనే వాటిని నిర్వహించడం జరిగింది టైగర్ ష్రాఫ్. ఇక అలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తే ఇందులో దక్షిణాది ఇండస్ట్రీలో తమ ఫేవరెట్ హీరో ఎవరే అనే ప్రశ్న  అడగగా.. అందుకు అల్లు అర్జున్ అని చెప్పుకొచ్చారు టైగర్ ష్రాఫ్. అనే పోస్ట్ చేయడం ప్రస్తుతం నెట్టింట ఫోటో వైరల్ గా మారుతోంది.


ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా షూటింగ్లో త్వరలో పాల్గొనబోతున్నారు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇక పాహద్ ఫాజీల్, అనసూయ సునీల్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సెకండ్ పార్ట్ లో రష్మిక అల్లు అర్జున్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పుష్ప సినిమా అయిపోయిన వెంటనే ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ కొద్ది కారణాల చేత ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి తిరిగి ఈ సినిమా చూసి ప్రారంభిస్తారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: