టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగులతో పలు సినిమాలు చాలా బిజీగా ఉన్నాయి అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అయితే స్టార్ హీరోలకు మాత్రం లీకుల బెడద ఇబ్బందికరంగా మారుతోందని చెప్పవచ్చు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ లీకులు ఎక్కడో ఒకచోట వస్తూనే ఉన్నాయి. ఇక గతంలో కూడా రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అవ్వడం జరిగింది. ఇక పుష్ప సినిమాకు సంబంధించి కూడా షూటింగ్ సమయంలో పలు ఫోటోలు లీక్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ నటిస్తున్న సినిమాకి కూడా సంబంధించి కొన్ని లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇక నిన్నటి రోజున ప్రభాస్ నటించిన సలార్ సినిమాకి సంబంధించి ఒక మాస్ లుక్ ఫోటో బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అంతలోనే బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న 107వ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన ఫైట్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా అందుకు సంబంధించి ఒక వీడియో తాజాగా నెట్టింట వైరల్ గా మారుతొంది. అయితే బాలకృష్ణ విలన్ లపై ఉగ్రరూపం దాల్చినట్లుగా ఈ వీడియోను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్గా నటిస్తూ ఉన్నారు.


ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారుతోంది. దింతో బాలయ్య అభిమానులు కూడా పవర్ ప్యాక్ వీడియో అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య నటన అద్భుతంగా ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ చివరిగా అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఒకేసారి రెమ్యూనరేషన్ పెంచడంతోపాటుగా తన తదుపరి సినిమాలను వరుస పెట్టి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఈ సినిమా కంటే ముందు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న  అన్ స్టాపబుల్ -2 త్వరలోనే రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: