వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి భారీ క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం జనవరి 13న థియేటర్లో విడుదల చేయడానికి చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నారు. ఇక తమిళ హీరో విజయ్ నటించిన భైలింగ్వల్ మూవీ వారసుడు చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని ప్రచారంలో ఉంచారు.


అయితే చిరంజీవి సినిమా కాస్త ఆలస్యం అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని చిరంజీవి 154వ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందని కొంతమంది అభిమానుల సైతం భావిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను ఆలోచించిన చిరంజీవి తన 154 సినిమా పైన మొత్తం ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. డైరెక్టర్ బావి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పైన నిర్మించారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా రవితేజ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లుగా సమాచారం. ఇప్పటికి మూడు పాటలు మరియు కొద్దిగా టాకి పార్ట్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. చిరంజీవి, శృతిహాసన్ మీద రెండు పాటలతో పాటుగా ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేయవలసి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి విడుదలకు ఇంకా దాదాపుగా మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఒకవైపు షూటింగ్ మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టారని మేకర్స్ తెలియజేయడం జరిగింది. ఇక బాలయ్య కూడా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: