మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘కింగ్ ఆఫ్ కోతా'(KOK). కన్నడ ఇండస్ట్రీకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన క్రెడిట్ రాకింగ్ స్టార్ యష్ కి ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి దక్కుతుంది.ఇక అలాగే మలయాళం ఇండస్ట్రీకి కేఓకే మూవీ ద్వారా తనని తాను పాన్ ఇండియా హీరోగా మార్చుకొని రాకీ భాయ్ లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడట దుల్కర్. ఇంకా ఈ ‘కింగ్ ఆఫ్ కోతా’ మూవీని డెబ్యూ డైరెక్టర్ అభిలాష్ జోషి తెరకెక్కిస్తున్నాడు. ఇన్ని రోజులు డీసెంట్ రోల్స్, క్లాస్ సినిమాలతో మెప్పించిన దుల్కర్ సల్మాన్ ఇక కోతా మూవీతో తనలోని మాస్ యాంగిల్ ని బయట పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కూడా ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుండటం విశేషం.కింగ్ ఆఫ్ కోతాలో దుల్కర్ సల్మాన్ రోల్ .. కేజీఎఫ్ లో రాకీ భాయ్ ని మించి ఉంటుందని సమాచారం తెలుస్తుంది. 


తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. దీంతో లాస్ట్ డే షూటింగ్ కంప్లీట్ చేసి.. టీమ్ తో సందడి చేసిన వీడియోని కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు దుల్కర్. గత సంవత్సరం షూటింగ్ ఎక్కడైతే మొదలుపెట్టారో.. అక్కడే ఈ సినిమాని ఫినిష్ చేయడం విశేషం. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ కి ఏ భాషకి ఆ భాషలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. కానీ.. మలయాళం ఇండస్ట్రీకి ఒక్క పాన్ ఇండియా హీరో లేడనేది ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి బాధగా వుంది. ఆ లోటుని దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో తీర్చానున్నాడని సమాచారం తెలుస్తుంది.ఇప్పటిదాకా లవర్ బాయ్ గా అమ్మాయిల మనస్సులను దోచిన ఈ హీరో ఈ పాన్ ఇండియా సినిమాతో మరో రాకీ భాయ్ గా మారతాడో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KOK