కన్నడ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి ఉపేంద్ర ... కిచ్చా  సుదీప్ ... శివరాజ్ కుమార్ లు నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కబ్జా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో భారీ అంచనాల నడుమ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

అలా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ ఈ సినిమా మార్చి 17 వ తేదీన కన్నడ , తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో ఈ మూవీ కి దేశ వ్యాప్తంగా కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్ లు రాలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ప్రాజెక్టు గా మిగిలిపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వాడుతున్న వార్తల ప్రకారం గమనించినట్లు అయితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: