
అయితే ఇప్పుడు ఈమూవీకి సంబంధించి మరొక లీక్ బయటకు వస్తోంది. ఈమూవీ రెండు భాగాలు కాదని ఒక సిరీస్ గా కొన్ని మూవీలు వస్తాయని అంటున్నారు. పురాణాలలో ఉన్న కృష్ణ – కర్ణ - కృపాచార్యుడు లాంటి పాత్రలు ఇప్పటికీ సజీవంగా మన మధ్యన కనపడుతూనే ఉంటాయి అన్న పాయింట్ ను ఆధారంగా చేసుకుని ఈమూవీ సిరీస్ కథలను నాగ్ అశ్విన్ అల్లారు అని అంటున్నారు. ఈపాత్రాలను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ 8 సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ కె లో బ్రహ్మగా అమితాబచన్ నటిస్తున్నాడు అని టాక్. ఇలా జనం మధ్య తరతరాల సజీవంగా ఉండే పాత్రలతో నాగ్ అశ్విన్ ప్యాంటసీ సినిమాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి జానపద కథల స్ఫూర్తితో ‘బాహుబలి’ ఆతరువాత స్వాతంత్రోద్యమ స్పూర్తితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలను నిర్మిస్తే నాగ్ అశ్విన్ మాత్రం కొన్ని యుగాలుగా జన జీవనంలో కలిసి జీవిస్తున్న పురాణ పాత్రలను ఆధారంగా చేసుకుని ప్యాంటసీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి.
ప్రాజెక్ట్ కె విషయానికి వస్తే ఈమూవీ గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నాగ్ అశ్విన్ ఈమూవీని హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత భారీ అంచనాలు ఈమూవీ పై ఉండటంతో ఈమూవీ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 1000 స్థాయిలో జరిగినా ఆశ్చర్యంలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి..