
నటి పవిత్ర లోకేష్ తో వీకే నరేష్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రస్తుతం ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి పెళ్లి చేసుకోవాలంటే వీరు ముందు వివాహం చేసుకున్న వారికి విడాకుల పత్రాలు వస్తే తప్ప పెళ్లి ఆలోచనలు ఉన్నట్లు కనిపించలేదు. ఈనెల వీరిద్దరూ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదల కాబోతోంది.ఈ నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొన్న వేరు తమ రిలేషన్షిప్ ని బలంగా ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లడానికి సినిమాను ప్రమోషన్ చేస్తున్నారు
ఈ షోలోకి గెస్ట్లుగా వచ్చిన వీరు పవిత్రాన్ని ముద్దుగా ఏమని పిలుస్తారు నరేష్ అని ఓంకార్ అడగగా.. ముద్దుగా తనని అమ్ములు అని పిలుస్తానని ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని మరి ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో అంటూ తెలిపారు ఈ సందర్భంగా తమ రిలేషన్షిప్ గురించి కూడా ఓంకార్ ప్రశ్నించగా ఆకాశం మీద పడిన భూమి బద్దలైన మేము కలిసే ఉంటాం అంటూ నరేష్ పవిత్ర ఇద్దరు చెయ్యి పట్టుకొని చూపించడం జరిగింది. దీంతో వీరిద్దరూ ఆనందానికి అవధులు లేకుండా డాన్స్లు చేయడమే కాకుండా ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.