ఒకప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉన్న బాలివుడ్ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తర్వాత క్రేజ్ ను పెంచుకొనే పనిలోనే ఉందని వేరేలా చెప్పనక్కర్లేదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. తనకు కనిపించిన ప్రతిదానితో దుస్తులను తయారు చేసి తానే స్వయంగా ధరించి చూపెడుతుంది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా అనేక వేషధారణలతో ప్రయోగాలు చేసింది. విచిత్రమైన దుస్తులలో కనిపించింది. గొలుసులు, జనపనార సంచులు, పూలు, పండ్లు, వైర్లు ఇలా అనేకం ట్రై చేసింది. ఆమె శైలి అసాధారణ భావన అయినప్పటికీ నెటిజన్లు తనను ఎంతగానో ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆమె కొత్తగా ట్రై చేసిన డ్రెస్ చూసి మరోమారు నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఈ సారి వేసిన డ్రెస్ హ్యాండ్‌బ్యాగ్…
ఎస్.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ హ్యాండ్ బ్యాగ్ తో తనకు కావలసిన భాగాలను కవర్ చేసే విధంగా డిజైన్ చేయించుకుంది.. ఈ డ్రెస్సు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..ఈ వీడియో ప్రారంభంలో ఉర్ఫీ గోధుమ రంగు హ్యాండ్‌బ్యాగ్‌ని చూపించింది. ఆ తర్వాత ఆమె ఆ బ్యాగ్‌నే డ్రస్‌గా ధరించింది. బ్యాగ్‌లోని హ్యాండిల్స్‌ను సస్పెండర్‌లుగా ఉపయోగించింది. దానిని స్టైల్‌గా వదులుగా ఉంచడంతో ఇది చాలా వినూత్నంగా కనిపించింది. బ్యాగ్ పొట్టి జిప్ ఆ డ్రస్‌కి జేబులా మారింది. ఈ పాకెట్‌లో డబ్బు దాచుకోవచ్చు… అలా ఓ డ్రెస్సును రూపొందిందించింది. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది… ఆ వీడియోను ఒకసారి చూడండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి