టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా బాగా బిజీ అయ్యి తన జోరు చూపిస్తున్నారు. ఓవైపు వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా చాలా చురుగ్గా గడుపుతున్నారు.జనాల సమస్యలపై కృషి చేస్తూ నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నారు. ఇక ఎన్నికల సమరానికి వారాహి వాహనం ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు, మాటలు ఇంకా కౌంటర్లతో తన పొలిటికల్ ప్రత్యర్థులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే సూపర్ అప్డేట్ వచ్చేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులు, ఫాలోవర్లు, కార్యకర్తలతో ఇంట్రాక్ట్ కావడానికి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు.పవన్ కల్యాణ్ ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నట్లు ఆయన సోదరుడు నాగబాబు అధికారికంగా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక హి ఈజ్ కమింగ్ టు బ్లాస్ట్ అనే క్యాప్షన్ తో నాగబాబు పోస్ట్ చేశారు.  


ఇప్పటివరకు ఒక్క పోస్ట్ పెట్టని ఈ అకౌంట్ బయోలో ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో జై హింద్ అని పేర్కొన్నారు. అతి కొద్ది సమయంలోనే ఎన్నో వేల మంది పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్నారు.ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రతి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక తమిళ దర్శకుడు నటుడు సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ రీమేక్  బ్రో చేస్తున్నారు. ఈ సినిమా జూలై 28వ తేదీన విడుదల కానుంది. అలాగే గబ్బర్ సింగ్ మూవీతో కెరియర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు.ఇంకా పవన్ కల్యాణ్-డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రానున్న మరో చిత్రం హరిహర వీరమల్లు. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండి  పవన్ కల్యాణ్ రాజాకీయాల్లో  కూడా జోరు చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: