వాస్తవానికి అనీల్ రావిపూడి మూవీ తరువాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఒక మూవీ చేయవలసి ఉంది. ఈమూవీ వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపు విడుదల అవుతుందని అందులోని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ కు ధియేటర్లు దద్దరిల్లి పోతాయని ప్రచారం జరిగింది అయితే వాస్తవానికి జరిగింది వేరు. బాలయ్య బోయపాటిని పక్కకుపెట్టి బాబీ ని ఎంచుకోవడం బాలయ్య అభిమానులకు కూడ షాకింగ్ గా మారింది.
రాబోతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా మారాయి. అలాంటి పరిస్థితులలో ఒక పవర్ ఫుల్ పొలిటికల్ మూవీని కాదనుకుని బాలయ్య బాబీ చెప్పిన కథకు ఎందుకు ఓకె చేశాడు అంటూ బాలయ్య అభిమానులు కూడ అతడి నిర్ణయం పై కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈవిషయంలో బాలయ్య ఆలోచనలు వేరు అని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఈ సంవత్సరం నవంబర్ లో కానీ లేదంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో కానీ రావడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. బోయపాటి ఇప్పటికీ రామ్ మూవీ ప్రాజెక్ట్ నుండి బయట పడలేదు. ఇలాంటి పరిస్థితులలో బోయపాటితో పరుగులు తీయించి పొలిటికల్ మూవీని మొదలుపెట్టినా అది వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపు పూర్తి అవ్వకపోతే ఆశలకు మోసం వస్తుందని అన్న ఆలోచనలతో బాలయ్య బోయపాటిని పక్కకుపెట్టి బాబీ వైపు వెళుతున్నాడు అని అంటున్నారు. దీనితో వచ్చే ఎన్నికలలో బాలయ్య ఎన్నికల పంచ్ డైలాగుల హడావిడి ధియేటర్లలో వినిపించక పోవడం అతడి అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి