
సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఆరోజే యానిమల్ చిత్ర టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని గతంలో ట్విట్టర్ ద్వారా కూడా ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కూడా రణబీర్ కపూర్ యానిమల్ టీజర్ 28 సెప్టెంబర్ రిలీజ్ కాబోతోంది అంటూ ఒక విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే విషయాన్ని చిత్ర బృందం కన్ఫామ్ చేస్తూ సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.
ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా నవంబర్ నాటికల్లా పూర్తి చేసుకొని డిసెంబర్ 1న విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. నిర్మాత భూషణ్ కుమార్ టి సిరీస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత భూషణ్ కుమార్ భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 41 సంవత్సరాల వయసులో రణబీర్ కపూర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.