
ఇలా విభేదాల కారణంగా వీరిద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. కలిసి జీవితం మాత్రం సాగించడం లేదు. అయితే షమీ తన పర్సనల్ లైఫ్ సమస్యలన్నిటిని కూడా పక్కనపెట్టి మరి టీమ్ ఇండియా కోసం ఆడుతూ ఉండడంతో ఈ క్రికెటర్ పైన అభిమానులు ప్రశంసలు సైతం అందిస్తూ ఉన్నారు. షమీ బుల్లెట్ల బంతులను విసురుతూ ఉంటే బ్యాట్మన్స్ తిప్పలు చూసిన ప్రతి ఒక్కరు కూడా షమీని పొగిడేస్తూ ఉన్నారు. ఇక సెలబ్రిటీలు కూడా ఈ ప్లేయర్ మీద పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక హీరోయిన్ ఇతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధమే అంటూ కామెంట్స్ చేస్తోంది.
ఆమె ఎవరో కాదు ఊసరవెల్లి సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన పాయల్ ఘోష్.. ఇప్పుడు మరొకసారి వార్తలలో నిలుస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ .ఈసారి ఏకంగా షమీకి మ్యారేజ్ ప్రపోజల్ని సైతం తీసుకురావడం జరిగింది. ట్విట్టర్లో ఆమె షమీ గురించి చేసిన ట్విట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. ఈమె సరదాగా ట్వీట్ చేసినప్పటికీ కూడా నెటిజెన్లు మాత్రం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. షమీ నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే కచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ పాయల్ ఘోగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.