
రేడిన్ కింగ్స్టి సినిమాల మీద ఇష్టంతో కోలమాకు కోకిల అనే చిత్రం ద్వారా మొదటిసారిగా తన కెరీర్ను ప్రారంభించారట. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో కలిసి డాక్టర్ అనే సినిమాలో నటించి తన కామెడీతో మరింత గుర్తింపు అయితే సంపాదించుకున్నారు.ఇందులో ఇతని కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత LKG, బీస్ట్ ,మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవల రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కూడా నటించి విభిన్నమైన కమిటీ అనగా పేరు సంపాదించారు.
ఇక సంగీత విషయానికి వస్తే ఈమె పలు సీరియల్స్ లో నటిగా తన కెరీర్ ని కొనసాగిస్తుంది.. తిరుమల్ వంటి చిత్రంలో నటించిన ఈమె వీరిద్దరూ కలిసి ఒక సినిమా షూటింగ్లో పరిచయం ఏర్పడిందట.ఆ పరిచయమే ప్రేమగా మారి ఇలా పెళ్లితో ఒక్కటయ్యారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారడంతో ఇది కూడా ఏదో సినిమా షూటింగ్ అని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరి కొంతమంది ఇది నిజంగానే పెళ్లి చేసుకున్నట్లుగా పలువురు సెలబ్రిటీలు సైతం తెలియజేస్తున్నారు.