కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ సేతుపతి ఒకరు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన కేవలం తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా తెలుగు హిందీ భాష చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఇటీవల జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. దీంతో ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల విజయ్ సేతుపతి హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా విజయ్ సేతుపతి మరో బాలీవుడ్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఇటీవల సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కత్రినా కైఫ్ విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్సినిమా స్టోరీ చెప్పిన తర్వాత ఇందులో హీరో విజయ్ సేతుపతి అని చెప్పారు. అయితే విజయ్ సేతుపతి అనగానే నాకు వెంటనే ఈయన గుర్తు రాలేదని ఎవరు ఆ హీరో అని తెలుసుకోవడం కోసం తాను గూగుల్ సెర్చ్ చేశాను అంటూ కత్రినా కైఫ్ ఈ సందర్భంగా తెలిపారు. నేను 96 చూశాను, అందులో త్రిష, విజయ్ ఇద్దరూ చాలా ఇష్టం.కానీ ఇప్పుడు నేను నటించే కు విజయ్ సేతుపతిని తీసుకున్నారని తెలియగానే తను గుర్తు రాకపోవడంతోనే గూగుల్ సెర్చ్ చేశాను అంటూ ఈ సందర్భంగా కత్రినా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: