తెలుగు సినిమా ఇండస్ట్రీ లోహీరోయిన్ మీనా అంటే తెలియనివారుండరు. చిన్నప్పటినుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా, స్టార్ హీరోయిన్ గా చాలా మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే మీనా గురించి ఒక వార్త వైరల్ గా మారుతుంది.తనని సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి ఆరేళ్లుగా ప్రేమ పేరుతొ వేధించాడని నటి నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి.సంతోష్ వర్కీ అనే అతను తనను ఓ 30 రకాల ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసి విసిగిస్తూ, వేధించాడని, ఆరేళ్లపాటు నరకం చూశాను అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఆ తరువాత మోహన్‌లాల్ నటించిన ఆరత్‌ని సమీక్షించినందుకు సంతోష్ వర్కి మలయాళీలలో ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి ఒక ఫిలిం క్రిటిక్ గా మారిపోయి సినిమాలకి రివ్యూలు ఇస్తున్నారు. ఆరత్ అన్నన్‌గా పేరుగాంచిన సంతోష్ వర్కి తరచూ వివాదాల్లో కూరుకుపోతుంటారు. నటి నిత్యా మీనన్‌కి సంబంధించిన వివాదాల తర్వాత, సంతోష్ వర్కిపై చాలా మంది అనేక ఆరోపణలు చేశారు. నిత్యా మీనన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్టు సంతోష్ వర్కి చాలా చోట్ల చెప్పాడు. ఈ క్రమంలో నిత్యా మీనన్ తనపై విమర్శలు చేయడంతో, సంతోష్ వర్కి క్షమాపణలు చెప్పాడు. అయితే దీని తర్వాత కూడా మళ్లీ సినీ నటీమణులకు సంబంధించిన వివాదాలు తలెత్తాయి. తనకు నటి నిఖిలా విమల్ అంటే ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కూడా ఆ మధ్య సంతోష్ వర్కి తెలిపారు. తర్వాత, మోనిషా మోహన్ మీనన్, ఐశ్వర్య లక్ష్మీ, మంజు వారియర్, నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ మొదలైన వారిని వివాహం చేసుకోవడానికి తాను ఆసక్తిగా ఉన్నానని సంతోష్ వర్కి చెప్పడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సంతోష్ వర్కి తెరపైకి వచ్చారు. సంతోష్ వర్కి తాజా వీడియోలో నటి మీనా గురించి మాట్లాడారు. ఈ మధ్యనే భర్తను కోల్పోయిన నటి మీనాకు జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సంతోష్ వర్కి తెలిపారు. మంజు వారియర్ లాగే మీనా చాలా మంచి అమ్మాయి. మీనాకు జీవితాన్ని ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మీనాకు కుమార్తె ఉండటం తనకు ఇబ్బంది కాదని సంతోష్ వర్కి తెలిపారు. అదే సమయంలో, చాలా మంది వీడియో కింద సంతోష్ వర్కీని విమర్శించారు. పబ్లిసిటీ కోసం ఇంత చీప్ గా ఉండకూడదని చాలా మంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: