నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలకృష్ణ.. గత మూడు దశాబ్దాల నుంచి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గానే కొనసాగుతూ ఉన్నాడు   అయితే ఇండస్ట్రీలో ఎంతమంది బడా హీరోలు ఉన్న ఎందుకో బాలయ్య కు మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక మాస్ ప్రేక్షకులు అందరూ కూడా బాలయ్య సినిమా వచ్చిందంటే.. చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. ఇక ఆయన చెప్పే పంచు డైలాగుల గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువే.


  గత కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నారు బాలకృష్ణ. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ ఏకంగా ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో దూకుడు మీద ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం  బాబి తో ఒక మూవీ చేస్తున్నాడు. ఎన్.బి.కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి శివరాత్రి సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులు అందరిలో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది .


 ఇక ఈ మూవీ కోసం అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉండగా.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టారు అంటూ ఒక టైటిల్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వీరమాస్ అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసిందట. అయితే ఈ టైటిల్ బాలకృష్ణ సినిమా కోసమే అని కొంతమంది అనుకుంటూ ఉంటే.. కాదు మరో సినిమా కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేశారు అంటూ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. మరి అసలు విషయం ఏంటన్నది అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: