సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన "టిల్లు స్క్వేర్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే 91 కోట్ల వసూళ్లను అందుకుంది. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడానికి ఇంకా కేవలం ఇంచు దూరంలో ఉంది. నార్త్ అమెరికాలో $ 2 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఈరోజో రేపో వంద కోట్ల మైలురాయి మార్క్ ను కూడా ఈజీగా క్రాస్ చేయబోతోంది.బ్లాక్ బస్టర్  'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా "టిల్లు స్క్వేర్" సినిమా తెరకెక్కింది. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఈ మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ లుక్, ట్రైలర్ లో అనుపమ చాలా బోల్డ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. టిల్లుగా సిద్ధు మరోసారి క్రేజీ హిట్ కొట్టాడు. చెప్పినట్లుగానే 'అట్లుంటది మనతోని' అంటూ.. ప్రేక్షకులకు డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు.'టిల్లు స్కేర్' అనేది హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచిపోయే సినిమా. ఇందులో ప్రధానంగా డీజే టిల్లు పాత్ర, అతని చుట్టూ అల్లుకున్న పాత్రలు, వారి మధ్య వచ్చే సంభాషణలు ఉంటాయి. ఇవే ఇప్పుడు ప్రేక్షకులు రెండు గంటల సేపు అన్నీ మరిచిపోయి హాయిగా ప్రశాంతంగా నవ్వుకునేలా చేస్తున్నాయి.


టిపికల్ డైలాగ్ డెలివరీతో సిద్ధు చెప్పిన క్రేజీ డైలాగులు జనాలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.మరోవైపు అనుపమ కూడా తన గ్లామర్ తో కట్టిపడేసింది.అనుపమ ఈ మూవీలో రౌడీ బాయ్స్ సినిమా కంటే బోల్డ్ గా కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఎలాంటి మొహమాటం లేకుండా సిద్ధూతో కలిసి సుదీర్ఘమైన లిప్ లాక్స్ సీన్స్ లో నటించి అదరగొట్టింది. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు యూత్ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పిస్తున్నాయి.. బాక్సాఫీసు దగ్గర సాలిడ్ వసూళ్లు కురిపిస్తున్నాయి.'టిల్లు స్కేర్' కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య నిర్మించారు.ఈ మూవీలో నేహా శెట్టి, ప్రియాంక జవాల్కర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ మూవీకి రామ్ మిర్యాల, అచ్చు సంగీతం సమకూర్చగా.. భీమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. త్వరలో థర్డ్ పార్ట్ 'టిల్లు క్యూబ్' కూడా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: