విశ్వక్ సేన్ ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. విశ్వక్సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకుంది. ఇక ఆ సినిమాలో విశ్వక్ రౌడీ క్యారెక్టర్ లో కనిపించాడు. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాల్లో నటిస్తూ దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రజెంట్ విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ మూవీ చేస్తున్నాడు. అంతే కాకుండా ఆడపిల్ల గెటప్ తో లైలా అనే మరో సినిమాతో ప్రయోగం చేయబోతున్నాడు.


ఈ రెండు చిత్రాలపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, విశ్వక్ సేన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గన్ పాకెట్ లో పెట్టుకుని నిలుచున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు మేకర్. శ్రీధర్ గంట దర్శకత్వంలో VS 13 వర్కింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్క పోతుంది. దీనిని SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా..మ్యూజిక్ డైరెక్టర్గా ఆంజనీష్ సంగీతం అందిస్తున్నాడు.


విశ్వక్సేన్ మొట్టమొదటిగా వెళ్ళిపోమాకే అనే సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత హిట్, తెలుగోడి ఆత్మగౌరవం, ఆకాశవనంలో అర్జున కళ్యాణం, మను చిరిత్ర, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి వంటి సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. గామి మూవీలో నటించిన తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ కొత్త మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం హిట్ కొట్టలేకపోయింది. మరి ఈ సినిమా అయినా కొడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: