చాలామంది హీరోలు , హీరోయిన్లను పెళ్లి చేసుకోవటం ఎంతో కామ‌న్ .. కొంతమంది సెలబ్రిటీలు మాత్రం తమ తో కలిసి నటించిన కో స్టార్స్‌ ను ప్రేమించి పెళ్లాడుతారు .. అలాంటి హీరోయిన్లు ఒక టాప్ తెలుగు హీరోయిన్ కూడా ఉన్నారు .. తన సినిమా హీరోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ .. ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్ గురించి కొత్త గా చెప్పాల్సిన పనిలేదు .. ఆమెకు ఓ రేంజ్ ఫ్యాన్  ఫాలోయింగ్ ఉంది .. ఇంత‌కి ఆమె మరెవరే కాదు అందాల ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా .. టాలీవుడ్ లో సై , బొమ్మరిల్లు , ఢీ , రెడీ , ఆరెంజ్ సినిమాలతో మంచి క్రెజ్‌ తెచ్చుకుంది ..


అలాగే బాలీవుడ్ లో తుజే మేరీ కస‌మ్‌ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది .. ఈ సినిమాలో రితిష్ దేశ‌ముఖ్‌ హీరో గా నటించాడు .. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే రితిష్ తో ప్రేమలో పడింది జెనీలియ‌ ఆ తర్వాత ఈ ఇద్దరు చాలా కాలం ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు .. అయితే రితీష్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్  కొడుకు .. ప్రస్తుతం జెనీలియా సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది ..


అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో జెనీలియా తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అలాగే తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో జెనీలియా భర్త ఈమె మరిది ఎన్నికల్లో పోటీ చేసి పలుచోట్ల విజయం సాధించారు .. అయితే జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది .. మరాఠీలో మాత్రం తన భర్తతో కలిసి పలు సినిమాల్లో నటించింది .. కాని తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వట్లేదు .. జెనీలియా రాబోయే రోజులైనా రీయంట్రి ఇస్తుందో లేదో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: